Adivi Sesh: మహేశ్ చేతుల మీదుగా 'మేజర్' సాంగ్ రిలీజ్!

Major Movie Song Released
  • 'మేజర్'గా అడివి శేష్
  • నిర్మాతగా మహేశ్ బాబు
  • సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాల
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  
అడివి శేష్ హీరోగా 'మేజర్' సినిమా రూపొందింది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. అడివి శేష్ జోడీగా సయీ మంజ్రేకర్ తెలుగుతెరకి కథానాయికగా పరిచయమవుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి కొంత సేపటి క్రితం మహేశ్ బాబు చేతుల మీదుగా ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు.

"నిన్నే కోరే నే నిన్నే కోరే .. ఆపేదెలా నీ చూపునే, లేనే లేనే నే నువ్వై నేనే ..  దారే మారే నీ వైపునే ..' అంటూ మొదలైన ఈ పాట, 'హృదయమా .. వినవే హృదయమా" అంటూ సాగుతోంది. నాయకా నాయికల మధ్య అనుభవాలు ..  అనుభూతులు .. జ్ఞాపకాలకి సంబంధించిన విజువల్స్ పై ఈ సాంగ్ ను కట్ చేశారు.

కృష్ణకాంత్ సాహిత్యం అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించాడు. విరహంతో కూడిన వియోగం నేపథ్యంలో వచ్చే ఈ పాట యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ప్రకాశ్ రాజ్ .. రేవతి .. మురళీశర్మ .. శోభిత ధూళిపాళ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Adivi Sesh
Saiee Manjrekar
Major Movie

More Telugu News