Molu Life: కరోనా ట్యాబ్లెట్ మోల్నుపిరవిర్‌తో సైడ్ ఎఫెక్ట్స్ వార్తలపై స్పందించిన మెర్క్ ఇండియా ఫార్మా

merck india responds abourt Molu Life side affects

  • కరోనా ట్యాబ్లెట్ల వినియోగానికి డీసీజీఐ అనుమతి
  • ఈ ట్యాబ్లెట్లు వాడితే కణజాలం, ఎముకలు దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఐసీఎంఆర్
  • మాత్రల సామర్థ్యంపై తమకు పూర్తి నమ్మకముందన్న మెర్క్ ఇండియా

దేశంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన కరోనా మాత్ర మోల్నుపిరవిర్‌ వల్ల దుష్ప్రభావాలు తలెత్తుతాయన్న ఐసీఎంఆర్ ప్రకటనపై మెర్క్ ఇండియా ఫార్మా సంస్థ స్పందించింది. అత్యవసర వినియోగానికి మోల్నుపిరవిర్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసిన తర్వాతి రోజే ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ.. ఈ మాత్రలతో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు (మ్యూటాజెనెసిటీ) వస్తాయని పేర్కొన్నారు. అంటే ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా మెర్క్ ఇండియా ఫార్మా స్పందించింది. మోల్నుపిరవిర్ ట్యాబ్లెట్ల సామర్థ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేసింది. ఈ మాత్రల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవని ఫేజ్ 3 ట్రయల్స్‌లో వెల్లడైనట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News