Mother Teresa: మదర్ థెరెసా చారిటీ విరాళాలకు తొలగిన అవరోధాలు

Foreign Funds Licence For Mother Teresas Charity Restored

  • ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరణ
  • యథావిధిగా సేవా కార్యక్రమాలు
  • రాజకీయ విమర్శలకు తెర

మదర్ థెరెసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఫారీన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీసీఆర్ఏ) కింద లైసెన్స్ ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో రెండు వారాలుగా నెలకొన్ని అనిశ్చితికి తెరపడింది.

విదేశాల నుంచి విరాళాలను స్వీకరించేందుకు చారిటీకి ఉన్న లైసెన్స్ గడువు ఇటీవల ముగిసింది. పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోగా, కొన్ని లోపాలను సర్కారు గుర్తించింది. దీంతో వాటిని సరిదిద్ది, నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనిపై ప్రతిపక్షాలు, పలు ఇతర వర్గాల నుంచి అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్నో కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతుందన్న ఆందోళన కూడా కనిపించింది.

అయితే, సదరు చారిటీ తాజా దరఖాస్తుతో లైసెన్స్ ను పునరుద్ధరించినట్టు తెలుస్తోంది. మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్వహిస్తున్న చిన్నారుల సంరక్షణ కేంద్రంలో మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నట్టు గుజరాత్ లో ఒక పోలీసు కేసు నమోదు అయిన రెండు వారాల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. రెండు వారాల క్రితం సుమారు 6,000 సంస్థలకు సంబంధించి విదేశీ విరాళాల లైసెన్స్ గడువు తీరిపోయింది.

  • Loading...

More Telugu News