Assembly Elections: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం
- త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
- ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో పోలింగ్
- యూపీలో ఏడు దశల్లోనూ పోలింగ్
- పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు
- మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3న పోలింగ్
పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10న జరిగే తొలిదశ పోలింగ్ తో ఎన్నికలు షురూ అవుతాయి. ఫిబ్రవరి 14న రెండో దశ, ఫిబ్రవరి 20న మూడో దశ, ఫిబ్రవరి 23న నాలుగో దశ, ఫిబ్రవరి 27న ఐదో దశ, మార్చి 3న ఆరో దశ, మార్చి 7న ఏడో దశ పోలింగ్ జరగనుంది.
403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఏడు దశల్లోనూ పోలింగ్ జరుగుతుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగుతాయి. మణిపూర్ లో ఫిబ్రవరి 23, మార్చి 3వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ ఉంటుంది. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఓట్లను లెక్కించనున్నారు.
కాగా, తొలిదశ ఎన్నికల కోసం జనవరి 14న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్లకు చివరి తేదీ జనవరి 21. జనవరి 24న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు జనవరి 27. ఫిబ్రవరి 10న పోలింగ్ జరగనుంది.