Sainik schools: దేశవ్యాప్తంగా 100 సైనిక స్కూళ్లు.. సాయుధ దళాల్లోకి బాలికలకు చోటు: రాజ్ నాథ్

100 new Sainik schools to provide opportunity to girl students to join armed forces

  • దేశానికి సేవ చేసే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు
  • బాలికలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవచ్చు
  • కరిక్యులమ్ తోపాటు దేశభక్తి బోధన

దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైనిక స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ స్కూళ్ల ఏర్పాటుతో ఇక్కడ చదువుకున్న బాలికలు సాయుధ దళాల్లో చేరేందుకు, దేశ భద్రత కోసం పోరాడేందుకు మార్గం ఏర్పడుతుందన్నారు.

సాయుధ దళాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు రాజ్ నాథ్ చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. సైనిక స్కూళ్లలో వారికి చోటు కల్పించడం, మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలను గుర్తు చేశారు. కొత్త సైనిక స్కూళ్ల ఏర్పాటుతో దేశానికి సేవ చేయాలన్న బాలికల ఆకాంక్షలు నెరవేరతాయన్నారు.

సైనిక స్కూళ్ల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ లు కేటాయించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇది స్కూళ్ల మధ్య పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. ఆవిష్కరణలకు వీలు కలుగుతుందన్నారు. సైనిక స్కూళ్లలో కరిక్యులమ్ తోపాటు దేశభక్తి, దేశం పట్ల విధేయత పెరిగేలా వారికి శిక్షణ ఉంటుందని రాజ్ నాథ్ చెప్పారు.

  • Loading...

More Telugu News