Maoist Jagan: పెసలపాడు ఎన్ కౌంటర్ బూటకం: మావోయిస్టు అగ్రనేత జగన్ లేఖ

Maoist leader Jagan condemns Pesalapadu encounter

  • గత డిసెంబరులో పెసలపాడు వద్ద ఎన్ కౌంటర్
  • ఆరుగురు నక్సల్స్ మృతి
  • అమాయక ఆదివాసీలను కాల్చి చంపారన్న జగన్
  • తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం

గత నెలలో తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పెసలపాడు అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరగడం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ ను మావోయిస్టు పార్టీ అప్పుడే ఖండించింది. తాజాగా మావోయిస్టు అగ్రనేత జగన్ దీనిపై లేఖ రాశారు.

డిసెంబరు 26న జరిగిన పెసలపాడు ఎన్ కౌంటర్ బూటకం అని ఆరోపించారు. అమాయక ఆదివాసీలను కాల్చి చంపి ఎన్ కౌంటర్ అని కట్టుకథ అల్లారని మండిపడ్డారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో టీఆర్ఎస్ సర్కారు, పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు.

సిరిసినగండ్ల సర్పంచ్ లక్ష్మారెడ్డికి మావోయిస్టులు లేఖ రాసినట్టు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అతడు తప్పుడు లేఖ అడ్డుపెట్టుకుని పోలీసుల రక్షణ కోరాడని మావోయిస్టు నేత జగన్ వివరించారు. లక్ష్మారెడ్డి ద్వారా మావోయిస్టు పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలను కోవర్టులుగా వాడుకుంటే కోర్స రమేశ్ కు పట్టినగతే పడుతుందని హెచ్చరించారు. భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్ తప్పుడు ప్రచారం మానుకోవాలని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News