Unstoppable Talk Show: బాలయ్య 'అన్ స్టాపబుల్ షో'లో విజయ్ దేవరకొండ 'లైగర్' టీమ్ సందడి

Vijay Devarakonda Liger team participates Balakrishna Unstoppable Talk Show
  • బాలకృష్ణ హోస్ట్ గా 'అన్ స్టాపబుల్' షో
  • కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్న బాలయ్య
  • సందడి చేసిన విజయ్ దేవరకొండ, పూరీ, చార్మీ
  • జనవరి 14న ఎపిసోడ్ ప్రసారం
ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షో అద్భుత ప్రజాదరణ పొందుతోంది. బాలకృష్ణ తన చమత్కారాలు, ఛలోక్తులు, కొంటె ప్రశ్నలతో ఒక ఎపిసోడ్ ను మించి మరో ఎపిసోడ్ ను రక్తి కటిస్తున్నాడు.

తాజాగా 'అన్ స్టాపబుల్ షో'లో విజయ్ దేవరకొండ లైగర్ టీమ్ పాల్గొంది. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ ఈ షోకి విచ్చేశారు. ఈ ఎపిసోడ్ జనవరి 14న ఆహా యాప్ లో ప్రసారం కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కానుంది.
Unstoppable Talk Show
Balakrishna
Aha OTT
Liger
Vijay Devarakonda
Puri Jagannadh
Charmme
Tollywood

More Telugu News