Telangana: తెలంగాణలో పెరుగుతున్న కరోనా బాధితులు.. ఆసుపత్రులకు తాకిడి!

No mild wave warn doctors as hospitalisation nos rise

  • గత వారం రోజువారీగా 278 మంది చేరిక
  • ముందు వారంలో 3-4 మందికే ఆసుపత్రి అవసరం
  • డెల్టా వేరియంట్ ఇంకా వ్యాప్తిలోనే ఉంది
  • అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు 

కరోనా కొత్త రకం ఒమిక్రాన్ పెద్దగా ప్రాణహాని చేయడం లేదన్న భావన పెరిగిపోయింది. గత రెండు వేరియంట్లతో పోలిస్తే దీని ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలంగాణ వైద్యులు అంటున్నారు. మరోవైపు డెల్టా వేరియంట్ ఇంకా వ్యాప్తిలోనే ఉంది. నిర్లక్ష్యానికి చోటు లేకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక కరోనా రెండు విడతలతో పోలిస్తే ఆసుపత్రిలో చేరాల్సిన కేసుల సంఖ్య ఇప్పటి వరకు తక్కువగానే ఉంటోంది. కానీ, గత వారంలో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్టు వైద్యులు చెబుతున్నారు. గత వారం రోజువారీ 278 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేరారు. కానీ, అంతకు ముందు వారంలో చేరిన కేసుల సంఖ్య 3-4గానే ఉంది.

ప్రస్తుతానికి ఆసుపత్రుల్లో బాధితుల సంఖ్య తక్కువగానే కనిపిస్తున్నా.. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే రకం కావడంతో ఎక్కువ మందికి సోకే అవకాశం వుంది. తద్వారా ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య గత రెండు వేరియంట్లతో పోలిస్తే అధికంగా ఉండొచ్చన్న అభిప్రాయం వైద్య నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. కేవలం వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యల ద్వారానే మూడో విడతను అధిగమించగలమని పేర్కొంటున్నారు.

ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాల మాట నిజమే అయినా.. అందరిలోనూ ఇలానే ఉంటుందని అనుకోవద్దు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన వారిలో 182 మందికి ప్రస్తుతం ఆక్సిజన్ అందిస్తున్నారు. 112 మంది ఐసీయూల్లో చికిత్స తీసుకుంటున్నారు. మరొక విస్మరించరాని విషయం ఏమిటంటే, డెల్టా వేరియంట్ ఇప్పటికీ పోలేదు. అది ఇంకా వ్యాప్తిలోనే ఉంది. డెల్టా వేరియంట్ లో చాలా మందికి ఆక్సిజన్ సాయం అవసరమైన విషయం గుర్తుండే ఉంటుంది.

  • Loading...

More Telugu News