Andhra Pradesh: ఏపీలో నైట్ కర్ఫ్యూ.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్

Night curfew in Andhra Pradesh

  • ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
  • రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
  • మాస్కులు పెట్టుకోని వారికి భారీ జరిమానా విధించాలన్న సీఎం

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూని విధించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూని అమలు చేయనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈరోజు ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అవసరమైన మందులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరోనా బాధితులకు ఇచ్చే హోంకిట్లలో మార్పులు చేయాలని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మాస్క్ పెట్టుకోని వారికి భారీ జరిమానా విధించాలని ఆదేశించారు. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా మాస్కులు ధరించాలని చెప్పారు.

కోవిడ్ నిబంధలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించేలా చూడాలని జగన్ చెప్పారు. 104 కాల్ సెంటర్ ను బలోపేతం చేయాలని సూచించారు. థియేటర్లలో 50 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. సీటు మార్చి సీటుకు అనుమతించాలని చెప్పారు. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి, ఇండోర్ కార్యక్రమాల్లో 100 మందికి మించి అనుమతించకూడదని ఆదేశించారు.

  • Loading...

More Telugu News