G Jagadish Reddy: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా నిర్ధార‌ణ‌

jagdish reddy tests corona positive

  • స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు
  • క‌రోనా నిర్ధార‌ణ కావ‌డంతో హోం ఐసోలేషన్‌లో మంత్రి
  • తనను కలిసిన‌ వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞ‌ప్తి

తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా వైర‌స్‌ సోకింది. ఆయ‌న‌కు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్ర‌స్తుతం జ‌గ‌దీశ్ రెడ్డి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన‌ వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని జ‌గ‌దీశ్ రెడ్డి కోరారు. ఇటీవల త‌న‌కు జలుబు, దగ్గు వంటి స్వల్ప లక్షణాలు క‌న‌ప‌డ్డాయ‌ని, పరీక్ష చేయించుకోగా.. కరోనా నిర్ధారణ అయింద‌ని జగదీశ్ రెడ్డి వివ‌రించారు.

జాగ్రత్తలు తీసుకుంటున్న‌ప్ప‌టికీ క‌రోనా సోకుతోందని, ప్రజలు ఈ విష‌యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయ‌న కోరారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయ‌న కోరారు. ఇంట్లోంచి బ‌య‌ట‌కు వెళ్తే తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాల‌ని ఆయ‌న సూచించారు. కాగా, ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరికొంద‌రు నేత‌ల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News