vitamins: మానసిక అశాంతికీ, విటమిన్ బి12 లోపానికీ లింక్?

vitamin B12 and mental health link

  • డిప్రెషన్ తోపాటు ఇతర సమస్యలు
  • మానసిక, శారీరక ఆరోగ్యంలో కీలక పాత్ర
  • రోజుకు 2-4 మైక్రోగ్రాములు అవసరం
  • శాకాహారుల్లోనే ఎక్కువ లోపం

దిగులుగా ఉందా..? అలసిపోయిన్నట్టు అనిపిస్తోందా..? బలహీనత తెలుస్తోందా..? విటమిన్ బి12 ఒక్కసారి ఎంతున్నదీ చెక్ చేసుకోండి. అప్పుడు మీ సమస్యలకు బి12 లోపమా? కాదా? అన్నది సులభంగా తెలిసిపోతుంది. నాడీ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు, మానసిక, శారీరక ఆరోగ్యానికి బి12 ఎంతో పాటుపడుతుందని చాలా అధ్యయనాలు లోగడ చెప్పాయి. తాజా అధ్యయం ఒకటి కూడా ఇదే చెబుతోంది.

మెదడు సక్రమంగా పనిచేయడంలో అత్యంత కీలక పాత్రను బి12 పోషిస్తోంది. బి12 నీటిలో కరిగే విటమిన్. కనుక ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. అమెరికన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డిస్క్రైబ్ ప్రకారం.. రక్త కణాలు, నాడీ కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు బి12 అవసరం. మెగాలోబ్లాస్టిక్ అనీమియాను ఇది నివారించగలదు. ఈ సమస్యలో ఎర్ర రక్త కణాలు కొద్దిగా ఉండడమే కాకుండా పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఆక్సిజన్ ను తగినంత సరఫరా చేయలేవు.

బి12 తక్కువగా ఉంటే డిప్రెషన్ (మానసిక దిగులు) కు దారితీస్తున్నట్టు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ చెబుతోంది. సెరెబ్రల్ అట్రోఫీ సమస్య ఏర్పడడానికి ఇదే కారణమని షికాగో హెల్త్ అండ్ ఏజింగ్ ప్రాజెక్టు పరిశోధకులు గతంలో ప్రకటించారు. బి12 లోపాన్ని సూచించే మెథిల్ మెలోనేట్ జ్ఞానంపై ప్రభావం చూపిస్తుందని తేల్చేశారు.

ముఖ్యంగా శాకాహారం తీసుకునేవారు, వృద్ధులు, జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు తగినంత బి12 పొందలేని పరిస్థితి ఉంటుంది. తీసుకునే ఆహారం ద్వారా తగినంత అందకపోవచ్చు. చేపలు, మాంసం, గుడ్లు, పప్పు ధాన్యాలు, బ్రౌన్ రైస్ ద్వారా విటమిన్ బి12 రూపంలో బి12 లభిస్తుంది. పెద్ద వారికి నిత్యం 2-4 మైక్రోగ్రాములు బి12 కావాలి. గర్భిణులు, మహిళలకు 2-8 మైక్రోగ్రాములు ఇవ్వాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News