Somu Veerraju: రాష్ట్ర రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే అంశాల‌ను బీజేపీ చేప‌డుతుంది: సోము వీర్రాజు

somu veerraju slams on ycp
  • మైండ్ గేమ్ రాజ‌కీయాలకు చెక్ పెడ‌తాం
  • రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాం
  • బీజేపీ, జ‌న‌సేన ఉమ్మ‌డిగా ప‌నిచేస్తాయి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మండిప‌డ్డారు. వైసీపీ నేత‌ల చ‌ర్య‌ల‌ను అడ్డుకుంటామ‌ని చెప్పారు. విజ‌య‌వాడ‌లో జరిగిన వివేకానంద జ‌యంతి వేడుక‌ల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప‌లువురు బీజేపీ నాయకులతో కలిసి స్వామి వివేకానంద చిత్ర‌ప‌టానికి పూలమాల వేసి, వివేకానంద‌ సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే అంశాల‌ను బీజేపీ చేప‌డుతుందని తెలిపారు. మైండ్ గేమ్ రాజ‌కీయాలకు తాము చెక్ పెడ‌తామ‌ని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ, జ‌న‌సేన ఉమ్మ‌డిగా ప‌నిచేస్తాయని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.




Somu Veerraju
BJP
YSRCP
Janasena

More Telugu News