Shadnagar: రెండు కేసుల్లో దోషిగా తేలిన ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి శంకర్‌రావు.. తీర్పు విని స్పృహ తప్పి పడిపోయిన వైనం

Former Minister Shankar Rao convicted in 2 criminal cases
  • శంకర్‌రావుకు వ్యతిరేకంగా 2015లో మూడు కేసులు
  • రెండింటిలో దోషిగా తేల్చిన కోర్టు
  • సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఓ కేసులో ఊరట
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి.శంకర్‌రావుకు హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై నమోదైన మూడు కేసుల్లో రెండింటిలో దోషిగా తేలారు. భూ వివాదంలో బెదిరింపులు, మహిళను దూషించిన ఆరోపణలపై 2015లో శంకర్‌రావుపై షాద్‌నగర్‌లో మూడు కేసులు నమోదయ్యాయి.

వీటిపై నిన్న విచారణ జరగ్గా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఓ కేసులో ఆయనకు ఊరట లభించింది. అయితే, భూ వివాదంలో బెదిరింపులు, మహిళను దూషించిన కేసులో మాత్రం శంకర్‌రావును కోర్టు దోషిగా తేల్చింది. మహిళను దూషించిన కేసులో రూ. 2,000, మరో కేసులో రూ. 1,500 జరిమానా విధించింది. కోర్టులోనే ఉన్న మాజీ మంత్రి తీర్పు వెలువడిన వెంటనే షాక్‌తో స్పృహ తప్పి పడిపోయారు.
Shadnagar
P Shankar Rao
Special Sessions Court

More Telugu News