Naga Chaitanya: సినిమా టికెట్ల అంశంపై నాగచైతన్య స్పందన
- నేను నటుడిని మాత్రమే
- నిర్మాతలకు సమస్య లేనట్టయితే నాకు కూడా లేనట్టే
- ఇప్పుడు అమల్లో ఉన్న దానితో మేము సంతృప్తి చెందుతున్నాం
సినిమా టికెట్ల అంశంపై టాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు టికెట్ల వ్యవహారం సినీ పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య గ్యాప్ ను పెంచింది. సినిమా వాళ్లపై కొందరు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదం మరింత ముదిరేలా చేశాయి. మరోవైపు ఇటీవల నాగార్జున మాట్లాడుతూ టికెట్ల ధరలను తగ్గించడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. తాజాగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ, తన తండ్రి తరహాలోనే సమాధానం ఇచ్చాడు.
తాను నటుడిని మాత్రమేనని, టికెట్ ధరల గురించి మీరు నిర్మాతలను అడగాలని నాగచైతన్య చెప్పాడు. టికెట్ ధరల తగ్గింపు వల్ల నిర్మాతలకు సమస్య లేకపోతే తనకు కూడా లేనట్టేనని అన్నాడు. తన ప్రాజెక్టుల ఆదాయవ్యయాల గురించి తాను పెద్దగా బాధ పడటం లేదని చెప్పాడు. టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతిస్తే అది తమకు సహాయం చేస్తుందని అన్నాడు. ఇప్పుడు అమల్లో ఉన్న దానితో తాము సంతృప్తి చెందుతున్నామని చెప్పాడు.
మరోవైపు సంక్రాంతి అయిపోయేంత వరకు థియేటర్లలో 100 శాతం కెపాసిటీకి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అంతేకాదు నైట్ కర్ఫ్యూని కూడా ఎత్తి వేసింది. దీంతో, సెకండ్ షో వేసుకోవడానికి వీలు కలిగింది.