Balakrishna: బాలకృష్ణ, అల్లు అర్జున్ కాంబినేషన్లో మల్టీ స్టారర్?

Multi starrer coming with the combination of Balakrishna and Allu Arjun
  • అల్లు కుటుంబం, బాలయ్య మధ్య పెరిగిన సాన్నిహిత్యం
  • ఆహా కోసం 'అన్ స్టాపబుల్' చేసిన బాలయ్య
  • బాలయ్య సినిమా ఫంక్షన్ కి చీఫ్ గెస్టుగా వచ్చిన బన్నీ
కరోనా పంజా విసిరిన తర్వాత థియేటర్లలో విడుదలైన బాలకృష్ణ చిత్రం 'అఖండ' ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన అల్లు అర్జున్ సినిమా 'పుష్ప' బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. మరోవైపు అల్లు కుటుంబం, బాలకృష్ణల మధ్య తాజాగా సాన్నిహిత్యం ఎక్కువైంది. అల్లు అరవింద్ కు చెందిన 'ఆహా' కోసం బాలయ్య 'అన్ స్టాపబుల్' చేశారు. అంతేకాదు 'అఖండ' సినిమా ఈవెంట్ కు బన్నీ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.

 ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఓ వార్త వైరల్ అవుతోంది. బాలకృష్ణ, అల్లు అర్జున్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కబోతోందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ వార్త బాలయ్య, బన్నీ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ 'ఆర్ఆర్ఆర్' ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో మల్టీ స్టారర్లపై సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
Balakrishna
Allu Arjun
Tollywood
Multi Starrer

More Telugu News