Sensex: భోగి రోజున స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు
- 12 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 2 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2.66 శాతం నష్టపోయిన ఏసియన్ పెయింట్స్
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా ఐదు రోజుల లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో ఈరోజు మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి.
అసలు ఈ రోజు ఉదయం భారీ నష్టాలతో మార్కెట్లు మొదలయ్యాయి. అయితే, మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు జరగడంతో మార్కెట్లు పుంజుకుని, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ కేవలం 12 పాయింట్లు మాత్రమే నష్టపోయి 61,223కి పడింది. నిఫ్టీ 2 పాయింట్లు కోల్పోయి 18,255 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (1.84%), ఇన్ఫోసిస్ (1.64%), ఎల్ అండ్ టీ (1.32%), టెక్ మహీంద్రా (1.18%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.11%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-2.66%), యాక్సిస్ బ్యాంక్ (-2.54%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.13%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.61%), విప్రో (-1.55%).