Vijay Devarakonda: చిరంజీవి హ్యాష్ ట్యాగ్ కు విజయ్ దేవరకొండ మద్దతు

Vijay Devarakonda supports Chiranjeevi on speculations
  • ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి భేటీ
  • వైసీపీ రాజ్యసభ టికెట్ అంటూ ప్రచారం
  • తీవ్రంగా ఖండించిన చిరంజీవి
  • GiveNewsNotViews హ్యాష్ ట్యాగ్ ను పంచుకున్న వైనం
సినీ పరిశ్రమ మేలుకోరి టికెట్ల అంశంపై సీఎం జగన్ ను కలిస్తే రాజ్యసభ టికెట్ కోసం అంటూ ప్రచారం చేయడం పట్ల చిరంజీవి స్పందించడం తెలిసిందే. దయచేసి ఊహాగానాలను వార్తలుగా ప్రసారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, GiveNewsNotViews (వార్తలను మాత్రమే అందించండి, అభిప్రాయాలను కాదు) అంటూ ట్విట్టర్ లో ఓ హ్యాష్ ట్యాగ్ ను ప్రారంభించారు.

 దీనిపై టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. GiveNewsNotViews ఉద్యమానికి నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండ గతంలో ఫేక్ న్యూస్ కు వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశారు.

అంతకుముందు చిరంజీవి ట్విట్టర్ లో స్పందిస్తూ... జగన్ తో సమావేశానికి రాజకీయ రంగు పులిమి, పక్కదారి పట్టించేలా కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అవన్నీ పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు.
Vijay Devarakonda
Chiranjeevi
GiveNewsNotViews
Speculations
CM Jagan

More Telugu News