Nagarjuna: తొలిరోజే 17 కోట్లకి పైగా కొల్లగొట్టేసిన 'బంగార్రాజు'
- 'బంగార్రాజు'గా నాగార్జున
- గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ
- యాక్షన్ కి .. రొమాన్స్ కి పెద్ద పీట
- థియేటర్లలో పండగ సందడి
నాగార్జున ఇంతకుముందు చేసిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా, గ్రామీణ నేపథ్యంతో కూడిన కథతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటి నుంచి ఆయన ఆ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆసక్తిని చూపుతూనే వచ్చారు. కథపై ఎక్కువ కాలం పాటు కసరత్తు చేయించిన ఆయన, కేవలం నాలుగు నెలల్లోనే సినిమాను రిలీజ్ కి రెడీ చేయించారు.
ఒకవేళ పెద్ద సినిమాలు బరిలో ఉన్నప్పటికీ తాను ఈ సినిమాను సంక్రాంతికి తీసుకుని వచ్చేవాడినే అని నాగార్జున చెప్పడం, ఈ కథపై ఆయనకి గల కాన్ఫిడెన్స్ కి అద్దం పడుతుంది. ఇక పెద్ద సినిమాలు తప్పుకోవడం కూడా 'బంగార్రాజు'కి బాగా కలిసొచ్చింది. పెద్దగా పోటీపడే సినిమాలేవీ లేకపోవడంతో విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది.
విడుదలైన తొలి రోజునే ఈ సినిమా 17 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ .. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుందని చెబుతూ ఒక పోస్టర్ ను వదిలారు. సక్సెస్ టాక్ రావడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.