Dr Irfan Ansari: కంగనా చెక్కిళ్ల కంటే మృదువైన రోడ్లను నిర్మిస్తానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

Jharkhand Congress MLA assures roads smoother than Kangana cheeks
  • కత్రీనా బుగ్గల్లా రోడ్లు మెరిసిపోవాలన్న రాజస్థాన్ మంత్రి
  • అదే తరహాలో వ్యాఖ్యానించిన ఝార్ఖండ్ ఎమ్మెల్యే
  • నునుపైన రోడ్లు నిర్మిస్తానంటూ ప్రజలకు హామీ
రాష్ట్రంలో రోడ్లు బాలీవుడ్ అందాలభామ కత్రీనా కైఫ్ బుగ్గల్లా నున్నగా మెరిసిపోవాలంటూ రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు కొన్నాళ్ల కిందట విమర్శల పాలయ్యాయి. తాజాగా, ఝార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించారు.

తన జమ్తారా నియోజకవర్గంలో 14 అంతర్జాతీయ స్థాయి రోడ్ల నిర్మాణం త్వరలోనే ప్రారంభం అవుతుందని, ఆ రోడ్లు నటి కంగనా రనౌత్ బుగ్గల కంటే మృదువుగా ఉంటాయని హామీ ఇస్తున్నానని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఒక వీడియోలో వెల్లడించారు.

రోడ్లను నటీమణుల చెక్కిళ్లతో పోల్చడం ఇదేమీ కొత్త కాదు. 2005లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ లో రోడ్లను డ్రీమ్ గాళ్ హేమమాలిని బుగ్గల్లా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
Dr Irfan Ansari
Congress MLA
Roads
Kangana Ranaut
Jamtara
Jharkhand

More Telugu News