Goa: పర్యాటకుల ప్రాధాన్యం ‘గోవా’.. తర్వాత మనాలి

Goa favourite destination for Indian travellers this year OYO survey
  • సిమ్లా, కేరళలోని అందాలు చూసేందుకు సుముఖత
  • విదేశాల్లో అయితే దుబాయి, ప్యారిస్, స్విట్జర్లాండ్
  • భాగస్వాములతో వెళ్లాలనుకునే వారు 37%
  • 'ఓయో ట్రావెలో పీడియా' సర్వేలో అభిప్రాయాలు
భారతీయ పర్యాటకులు గోవానే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. విదేశాలకు వెతుక్కుంటూ వెళ్లడం కంటే.. దేశీయంగా ఉన్న పర్యాటక అందాలను చూసేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారని ‘హోటల్స్ బుకింగ్’ సేవల సంస్థ ఓయో తెలిపింది. పర్యాటక ప్రియుల అభిరుచులను తెలుసుకునేందుకు ‘ఓయో ట్రావెలో పీడియా’ పేరిట ఒక సర్వే నిర్వహించింది.

61 శాతం మంది భారత పర్యాటకులు ఈ ఏడాది దేశీయంగా ఉన్న ప్రాంతాలను సందర్శించేందుకు ఇష్టపడుతున్నారు. 2022లో దేశ, విదేశీ ప్రాంతాలను చుట్టి రావాలన్నది తమ ఆలోచన అంటూ 25 శాతం మంది చెప్పారు. కరోనా మహమ్మారి దృష్ట్యా పర్యటనల సమయంలో భద్రత తమకు ఆందోళన కలిగించే అంశంగా సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. బూస్టర్ డోస్ అందుబాటులోకి వస్తుండంతో పర్యటనకు వెళ్లడానికి ఆటంకం ఉండబోదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

2022లో ఏ ప్రాంతాలకు మీ ఓటు అని అడగ్గా.. మూడింట ఒక వంతు మంది గోవా అని చెప్పారు. ఆ తర్వాత మనాలి, దుబాయి, సిమ్లా, కేరళ రాష్ట్రాలను ఎక్కువ మంది చెప్పారు. ఆ తర్వాత మాల్దీవులు, ప్యారిస్, బాలి, స్విట్జర్లాండ్ వెళ్లాలనుకుంటున్నట్టు కొందరు పేర్కొన్నారు. భాగస్వాములతో కలసి వెళతామని 37 శాతం మంది తెలిపారు. సన్నిహిత స్నేహితులతో వెళతామని 19 శాతం చెప్పగా.. కుటుంబ సభ్యులతో కలసి వెళతామని 16 శాతం మంది తెలిపారు.
Goa
manali
favourite destinations
oyo
survey
travellers

More Telugu News