Super Mom: 'సూపర్ మామ్' గా ఖ్యాతిపొందిన మధ్యప్రదేశ్ పులి ఇక లేదు!

Super Mom tigress in Madhya Pradesh is no more

  • పెంచ్ టైగర్ రిజర్వ్ లో విషాదం
  • కన్నుమూసిన కొల్లార్ వాలి పులి
  • 29 పిల్లలకు జన్మనిచ్చిన పులి
  • దహనసంస్కారాలు నిర్వహించిన అధికారులు

మధ్యప్రదేశ్ లోని పెంచ్ టైగర్ రిజర్వ్ పులుల సంరక్షణ కేంద్రంగా విలసిల్లుతోంది. ఈ పులుల అభయారణ్యంలో 'సూపర్ మామ్' గా పేరుపొందిన ఓ ఆడ పులి ఎంతో ఖ్యాతి పొందింది. ఇది 2008 నుంచి 2018 మధ్యకాలంలో 29 పిల్లలకు జన్మనిచ్చింది. ఓ పులి ఇన్ని పిల్లలకు జన్మనివ్వడం ఓ రికార్డు అని అధికారులు చెబుతున్నారు. కాగా, ఆ 29 పిల్లల్లో ప్రస్తుతం 25 జీవించి ఉన్నాయి.

కొల్లార్ వాలి పులిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ వ్యాఘ్రం ఇకలేదు. శనివారం సాయంత్రం కన్నుమూసిందని అధికారులు వెల్లడించారు. ఇది వృద్ధాప్యం కారణంగా మరణించినట్టు తెలుస్తోంది. దీనికి అధికారులు లాంఛనాలతో కూడిన దహన సంస్కారాలు నిర్వహించారు. భారతదేశంలో భారీ సంఖ్యలో పులులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇక్కడ 526 పెద్ద పులులు ఉన్నట్టు 2018 నాటి గణాంకాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News