Corona Virus: కరోనా కేసులు భారీగా ఉన్నా.. ఆంక్షలు విధించం: దక్షిణాఫ్రికా

We can not impose lockdown says  South Africa
  • ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది
  • జీవనోపాధి లభించడం కూడా కష్టమవుతుంది
  • ప్రజలు ఒమిక్రాన్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలరన్న దక్షిణాఫ్రికా 
కరోనా కేసులు భారీగా నమోదవుతున్నప్పటికీ కఠినమైన కోవిడ్ ఆంక్షలను విధించలేమని దక్షిణాఫ్రికా ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్ డౌన్లు, క్వారంటైన్లు వంటి ఆంక్షలతో ఇప్పటికే ఎంతో నష్టపోయామని పేర్కొంది. కఠినమైన ఆంక్షల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారవుతుందని... ప్రజలకు జీవనోపాధి లభించడం కష్టమవుతుందని, సామాజిక అంశాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది.  

వీటన్నిటి నేపథ్యంలో కోవిడ్ 19 ఆంక్షలను గుడ్డిగా అమలు చేయలేమని స్పష్టం చేసింది. ఒమిక్రాన్ కు ముందు వచ్చిన వైరస్ ల ద్వారా ప్రజలు వ్యాధి నిరోధకశక్తిని పెంచుకున్నారని... ఇప్పుడు వారు ఒమిక్రాన్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలరని తెలిపింది. ఇదిలావుంచితే, దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కూడా సౌతాఫ్రికాలోనే పుట్టింది.
Corona Virus
Lockdown
South Africa

More Telugu News