Formula E: హైదరాబాద్ కు వస్తున్న “ఫార్ములా ఈ” కార్ రేసింగ్.. ఢిల్లీ, ముంబైలను వెనక్కి నెట్టిన భాగ్యనగరి!

Formula E coming to Hyderabad

  • ఈ రేసింగ్ ను నిర్వహించనున్న ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డీ ఆటోమొబైల్ సంస్థ
  • టీఎస్ ప్రభుత్వానికి, ఫార్ములా ఈ సంస్థకు మధ్య కుదరనున్న ఒప్పందం
  • లండన్, న్యూయార్క్ ల సరసన చేరనున్న హైదరాబాద్ నగరం 

ఇప్పటికే ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్న హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఫార్ములా ఈ కార్' (ఎలక్ట్రిక్ కార్) రేసింగ్ కు భాగ్యనగరం ఆతిథ్యమివ్వబోతోంది. ఈ రేసింగ్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి, ఫార్ములా ఈ సంస్థకు, గ్రీన్ కో అనే సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగనుంది.

ఈ రేసింగ్ ను ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డీ ఆటోమొబైల్ అనే సంస్థ ప్రతి ఏడాది ఒక్కో నగరంలో నిర్వహిస్తుంటుంది. ఈ రేసింగ్ జరగబోతున్న నేపథ్యంలో లండన్, న్యూయార్క్, రోమ్, సియోల్ వంటి నగరాల సరసన హైదరాబాద్ చేరబోతోంది.

ఇతర రేసింగ్ లకు, ఈ కార్ రేసింగ్ లకు తేడా ఉంది. ఇతర రేసింగ్ లను ప్రత్యేకంగా నిర్మించిన రేస్ ట్రాక్ లలో నిర్వహిస్తారు. ఈ రేసింగ్ కు ప్రత్యేక ట్రాక్ అవసరం లేదు. నగరంలో రోడ్లు సాఫీగా ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు సరిగ్గా ఉండాలి.

మరోవైపు మన దేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలను కాదని ఈ రేసింగ్ హైదరాబాదుకు రానుండటం గమనార్హం. మరో విషయం ఏమిటంటే, ఈ ఒప్పందంలో భాగంగా రేస్ నిర్వహించే ప్రాంతాల్లో రోడ్లను విస్తరించాల్సి ఉంటుంది. అంతేకాదు, ప్రేక్షకుల కోసం అక్కడక్కడ స్టాండ్స్ ను ఏర్పాటు చేయాలి.

  • Loading...

More Telugu News