Devi Sri Prasad: సమంత అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది: దేవిశ్రీ ప్రసాద్

Devi Sri Prasad opines on choosing Samantha for item song in Pushpa
  • బన్నీ హీరోగా పుష్ప
  • సుకుమార్ దర్శకత్వంలో చిత్రం
  • విశేష ప్రజాదరణ పొందిన 'ఊ అంటావా' పాట
  • ఐటమ్ గాళ్ గా కనిపించిన సమంత
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' చిత్రంలో 'ఊ అంటావా మావా' ఐటమ్ సాంగ్ సూపర్ డూపర్ హిట్టయింది. ఈ పాటలో అందాలభామ సమంత నటించడంతో మాంచి క్రేజ్ వచ్చింది. దీనిపై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర వివరాలు తెలిపారు. ఈ పాటలో సమంతను తీసుకోవాలన్న నిర్ణయం పూర్తిగా దర్శకనిర్మాతలదేనని వెల్లడించారు. పాట రికార్డింగ్ అయినప్పటికీ అందులో ఎవరిని తీసుకోవాలో నిర్ణయించుకోలేదని, చివరికి సుకుమార్, నిర్మాతలు సమంతను తీసుకున్నారని వివరించారు.

సమంతను ఎంపిక చేసిన రెండ్రోజుల తర్వాత తనకు ఆ విషయం తెలిసిందని, ఆమె ఈ పాటకు సరిగ్గా సరిపోతుందని భావించానని దేవిశ్రీ అన్నారు. పాటకు కొత్త లుక్ వచ్చిందని, ఇప్పటిదాకా అనేక పాత్రల్లో కనిపించిన సమంత ఒక్కసారిగా ఐటమ్ సాంగ్ లో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారని వివరించారు. 'ఊ అంటావా' పాట కోసం సమంత చాలా కష్టపడిందని తెలిపారు.

ఇక, డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయింది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, దేవిశ్రీ సంగీతం సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లాయి.
Devi Sri Prasad
Samantha
Oo Antava
Item Song
Pushpa

More Telugu News