Nagarjuna: బలం తగ్గని 'బంగార్రాజు'
- ఈ నెల 14న విడుదలైన 'బంగార్రాజు'
- తొలి రోజునే 17 కోట్లకి పైగా గ్రాస్
- రెండో రోజున 36 కోట్లకి పైగా వసూళ్లు
- మూడో రోజున 50 కోట్ల క్లబ్ లోకి
- కొనసాగుతున్న జోరు
నాగార్జున కథానాయకుడిగా రూపొందిన 'బంగార్రాజు' సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి నాగార్జుననే నిర్మాతగా వ్యవహరించారు. నాగార్జునతో పాటు చైతూ కూడా సమానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, రమ్యకృష్ణ - కృతి శెట్టి కథానాయికలుగా ఆకట్టుకున్నారు.
ఈ సినిమాను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తిచేసి, థియేటర్లకు తీసుకుని రావడం విశేషం. తొలి రోజునే 17 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, రెండవ రోజున 36 కోట్ల గ్రాస్ ను రాబట్టి.. మూడో రోజున 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ మధ్య కాలంలో వసూళ్ల పరంగా చాలా స్పీడ్ చూపించిన సినిమాలలో ఇది ఒకటి.
ఇక ఏ సినిమా అయినా వీకెండ్ లో వసూళ్లను బాగానే రాబడుతుంది. అందువలన సోమవారం వసూళ్ల గ్రాఫ్ పడిపోకుండా ఉంటే ఇక ఢోకా లేనట్టుగా భావిస్తారు. అందువలన అందరూ కూడా సోమవారం వసూళ్లపై దృష్టి పెట్టారు. నిన్న కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టడంతో, ఇక ఇప్పట్లో 'బంగార్రాజు'కి ఎదురులేదని తేల్చేశారు. లాంగ్ రన్ లోను ఈ సినిమా కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందేమో చూడాలి.