Narendra Modi: దావోస్ సదస్సులో ఒక్కసారిగా ప్రసంగం ఆపేసిన మోదీ... రాహుల్ వ్యంగ్యం

Modi suddenly stops his speech in Daos seminar

  • దావోస్ లో ఆర్థిక సదస్సు
  • వర్చువల్ విధానంలో హాజరైన ప్రధాని మోదీ
  • మోదీ ప్రసంగానికి అంతరాయం
  • టెలీప్రాంప్టర్ ఆగిపోయిందన్న కాంగ్రెస్
  • మోదీ అబద్ధాలను భరించలేకపోయిందని రాహుల్ వ్యాఖ్యలు

దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2022 సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఒక్కసారిగా ఆపేశారు. కాసేపు అటూ ఇటూ చూశారు... చెవిలో ఉన్న ఆడియో పరికరాన్ని సరిచేసుకున్నారు. అనంతరం, "మా అనువాదకురాలి మాట వినిపిస్తోందా?" అంటూ ప్రశ్నించారు. స్వల్ప అంతరాయం తర్వాత ఆయన ప్రసంగం మళ్లీ కొనసాగింది.

దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. టెలీప్రాంప్టర్ ఆగిపోవడంతో ప్రధాని ప్రసంగం కూడా ఆగిపోయిందని వ్యాఖ్యానించింది. 'టెలీప్రాంప్టర్ ప్రధాని' అంటూ అభివర్ణించింది. "టెలీప్రాంప్టర్ మమ్మల్ని మోసం చేసింది... మాలో దమ్ము ఎక్కడుంది?" అంటూ వ్యంగ్యం ప్రదర్శించింది. అటు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కూడా స్పందించారు. ప్రధాని చెప్పే అబద్ధాలను టెలీప్రాంప్టర్ కూడా భరించలేకపోయిందని, అందుకే ఆగిపోయిందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News