Sensex: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు
- 634 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 181 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 4.57 శాతం నష్టపోయిన బజాజ్ ఫిన్ సర్వ్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 634 పాయింట్లు నష్టపోయి 59,464కు పడిపోయింది. నిఫ్టీ 181 పాయింట్లు కోల్పోయి 17,757 వద్ద స్థిరపడింది. ఇక వరుసగా గత మూడు సెషన్లలో కలిపి సెన్సెక్స్ సుమారు 1800 పాయింట్లు కోల్పోవడం గమనార్హం.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.86%), భారతి ఎయిర్ టెల్ (1.60%), ఏసియన్ పెయింట్స్ (0.81%), మారుతి సుజుకి (0.35%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.28%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-4.57%), ఇన్ఫోసిస్ (-2.33%), టీసీఎస్ (-2.25%), సన్ ఫార్మా (-2.20%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.97%).