daughter: వీలునామా రాయకపోతే తండ్రి ఆస్తుల్లో కుమార్తెలకు వాటా: సుప్రీంకోర్టు

daughter has the right to get father properties

  • వారసులకే తొలి హక్కు
  • మహిళకు వారసత్వంగా వచ్చిన వాటిపై తండ్రి వారసులకు హక్కు
  • ఓ కేసులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు

వీలునామా రాయకుండా తండ్రి మరణిస్తే, ఆయన స్వార్జితం, పిత్రార్జితంగా సంక్రమించిన ఆస్తుల్లో కుమార్తెలకు వారసత్వ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో మరణించిన వ్యక్తి సోదరుని పిల్లలకు కాకుండా సొంత కుమార్తెకే తొలి హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.

మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఒక పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే.. సొంత కుమార్తెకు ఆస్తులపై హక్కు ఉంటుందా? లేక అతని సోదరుని పిల్లలకు హక్కు ఉంటుందా? అన్న సందిగ్ధాన్ని కోర్టు పరిష్కరిస్తూ పై తీర్పును ఇచ్చింది.

"ఒకవేళ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమెకు తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిపై.. తండ్రి వారసులు అందరికీ సమాన హక్కు ఉంటుంది. అదే మహిళకు భర్త, అత్త, మామల ద్వారా వచ్చిన ఆస్తులపై వీలునామా లేకపోతే.. భర్త వారసులకు హక్కులు లభిస్తాయి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News