Ala Vaikunthapuramulo: డబ్బింగ్, రీమేక్ మధ్య క్లాష్.. 'అల వైకుంఠపురములో' డబ్బింగ్ వెర్షన్ విడుదల వాయిదా

Ala Vaikunthapuramulo release postponed

  • అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో 'అల వైకుంఠపురంలో'
  • హిందీలో డబ్ చేసిన గోల్డ్ మైన్స్ టెలీఫిలింస్
  • అటు 'షెహజాదా' పేరుతో అల వైకుంఠపురంలో రీమేక్
  • గోల్డ్ మైన్స్ వర్గాలతో 'షెహజాదా' నిర్మాతల చర్చలు

అల్లు అర్జున్, త్రివిక్రమ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురంలో'. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయాలని ఇటీవల నిర్ణయించారు. బన్నీ రీసెంట్ మూవీ 'పుష్ప' ఉత్తరాదిలోనూ భారీ వసూళ్లు రాబట్టడంతో 'అల వైకుంఠపురంలో' చిత్రాన్ని కూడా హిందీలో డబ్ చేశారు.

అయితే, మరోపక్క 'అల వైకుంఠపురంలో' చిత్రాన్ని హిందీలో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జోడీగా రీమేక్ చేశారు. ఈ రీమేక్ చిత్రానికి 'షెహజాదా' అని టైటిల్ ఫిక్స్ చేశారు. 'అల వైకుంఠపురంలో' డబ్బింగ్ చిత్రం ఈ సమయలో విడుదలైతే 'షెహజాదా'కు తీవ్ర నష్టం కలుగుతుందని నిర్మాతలు భావించారు.

'అల వైకుంఠపురములో' డబ్బింగ్ వెర్షన్ హక్కులు గోల్డ్ మైన్స్ టెలీఫిలింస్ అధినేత మనీష్ షా వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'షెహజాదా' నిర్మాతలు గోల్డ్ మైన్స్ అధినేత మనీష్ షాతో చర్చలు జరిపారు. చర్చలు ఫలవంతం కావడంతో 'అల వైకుంఠపురంలో' డబ్బింగ్ వెర్షన్ విడుదలను వాయిదా వేసేందుకు మనీష్ షా అంగీకరించారు. ఈ మేరకు గోల్డ్ మైన్స్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై 'షెహజాదా' నిర్మాతలు మనీష్ షాకు కృతజ్ఞతలు తెలియజేశారు.

  • Loading...

More Telugu News