SBI: రేపు ఎస్బీఐ ఆన్ లైన్ సేవలకు అంతరాయం
- టెక్నాలజీ అప్ గ్రేడ్ చేస్తున్న బ్యాంకు
- యోనో, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
- ఈ అర్ధరాత్రి 2 గంటల నుంచి నిలిచిపోనున్న సేవలు
- జనవరి 22 ఉదయం 8.30 గంటల వరకు అంతరాయం
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపు (జనవరి 22) సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ ప్రక్రియ చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఆన్ లైన్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచి జనవరి 22 ఉదయం 8.30 గంటల వరకు ఎస్బీఐ యోనో, యోనో లైట్, యూపీఐ, ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, యోనో బిజినెస్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. టెక్నాలజీ అప్ గ్రేడేషన్ ప్రక్రియ చేపడుతున్నట్టు వివరించింది.