Cowin: డార్క్‌వెబ్‌లో విక్రయానికి భారతీయుల కొవిడ్ డేటా.. అలాంటిదేమీ లేదన్న కేంద్రం!

Covid data of thousands of Indians leaked online
  • లబ్ధిదారుల పేర్లు, మొబైల్ నంబర్లు, చిరునామాలు అమ్మకానికి
  • కొవిన్ యాప్ ద్వారా బహిర్గతం?
  • పరిశీలిస్తున్నట్టు చెప్పిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
భారతీయలకు చెందిన వ్యక్తిగత కొవిడ్ డేటా డార్క్‌వెబ్‌లో అమ్మకానికి కనిపించింది. 20 వేల మందికిపైగా వ్యక్తుల పేర్లు, వారి మొబైల్ నంబర్లు, చిరునామాలు, కొవిడ్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి. వ్యాక్సినేషన్ కోసం కేంద్రం తీసుకొచ్చిన కొవిన్ యాప్ ద్వారా ఈ వివరాలు బహిర్గతమై ఉంటాయని తెలుస్తోంది. ఈ మొత్తం డేటాను ‘రైడ్ ఫోరమ్స్’ వెబ్‌సైట్‌లో నిందితుడు విక్రయానికి పెట్టాడు. సైబర్ భద్రత నిపుణుడైన రాజశేఖర్ రాజాహరియా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ వార్తలపై స్పందించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఈ వార్తలను తాము పరిశీలిస్తున్నామని పేర్కొంది. నిజానికి లబ్ధిదారుల చిరునామా, వారికి సంబంధించిన కొవిడ్ సమాచారాన్ని తాము సేకరించబోం కాబట్టి ఆ డేటా కొవిన్ యాప్ నుంచి బహిర్గతమైనది కాదని వివరించింది.
Cowin
COVID19
Dark Web
Data Leak

More Telugu News