Prabhas: డీవీవీ బ్యానర్లో .. మారుతి దర్శకత్వంలో ప్రభాస్?

Prabhas in Maruthi Movie
  • ప్రభాస్ కోసం కథ రెడీ చేసిన మారుతి
  • టైటిల్ గా 'రాజా డీలక్స్'
  • ప్రభాస్ నుంచి రావలసిన గ్రీన్ సిగ్నల్  
ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఆయన మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. డీవీవీ దానయ్య నిర్మాణంలో ప్రభాస్ ఒక సినిమా చేయవలసి ఉంది. అయితే ఇటీవల డీవీవీని కలిసిన మారుతి, తాను ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కథను వినిపించాడట.

'రాజా డీలక్స్' టైటిల్ తో ఆయన వినిపించిన కథ డీవీవీ దానయ్యకి బాగా నచ్చడంతో, ఇద్దరూ కలిసి ఈ లైన్ ను ప్రభాస్ చెవిన వేయడం జరిగిపోయిందని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావలసి ఉంది. ఈ ప్రాజెక్టు ఓకే అయితే నిర్మాణ భాగస్వామిగా ఉండటానికి నిరంజన్ రెడ్డి కూడా ముందుకు వచ్చాడని అంటున్నారు.

ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఒక టాక్ .. హారర్ కామెడీ సినిమా అని మరొక టాక్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో క్లారిటీ రావలసి ఉంది. ఇక గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన 'పక్కా కమర్షియల్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ తాజా చిత్రంగా 'రాధేశ్యామ్' కూడా విడుదలకి సిద్ధంగానే ఉంది.
Prabhas
Maruthi
Raja Deluxe Movie

More Telugu News