Rafat Al Qaravi: భర్త జైల్లో ఉండగా బయట నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన ఉగ్రవాది భార్య... ఎలాగో చూడండి!

How a terrorist gives birth four children while he was in prison

  • రఫత్ అల్ ఖరావీ కరుడుగట్టిన ఉగ్రవాది
  • 2006లో అరెస్టయిన రఫత్ అల్ ఖరావీ
  • జైలు నుంచి వీర్యం అక్రమ తరలింపు
  • కృత్రిమ పద్ధతిలో భార్య గర్భధారణ
  • 2021లో విడుదలైన ఖరావీ

రఫత్ అల్ ఖరావీ... కరుడుగట్టిన పాలస్తీనా ఉగ్రవాది. 2006లో ఇజ్రాయెల్ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న ఖరావీ గతేడాది మార్చిలో విడుదలయ్యాడు. బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఆ ఉగ్రవాది ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించాడు. తాను జైల్లో ఉన్న సమయంలో తన భార్య నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిందని తెలిపాడు. అదెలాగో ఖరావీ ఆసక్తికరంగా వివరించాడు.

"నేను జైల్లో ఉన్న సమయంలో నా వీర్యాన్ని పలు మార్గాల ద్వారా భార్యకు చేరవేసేవాడ్ని. ఆ వీర్యాన్ని రజాన్ మెడికల్ సెంటర్ కు అందజేసేవారు. అక్కడి వైద్య నిపుణులు కృత్రిమ పద్ధతిలో నా భార్య గర్భంలో ప్రవేశపెట్టేవారు. ఆ విధంగా నేను నలుగురు బిడ్డలకు తండ్రినయ్యాను కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలు నుంచి వీర్యం తరలించడం కోసం క్యాంటీన్ ను ఎంచుకున్నాను.

క్యాంటీన్ పనుల కోసం బయటి నుంచి వచ్చేవారిపై తనిఖీలు తక్కువగా ఉండేవి. దాంతో వీర్యాన్ని చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్ల కవర్లలో ఉంచి వారి ద్వారా జైలు వెలుపలికి పంపేవాడ్ని. జైలు బయట నా భార్య, తల్లి ఉండేవారు. వారు ఆ వీర్యాన్ని రజాన్ మెడికల్ సెంటర్ కు చేరవేసేవారు" అని ఖరావీ తెలిపాడు.

కాగా, ఖరావీ మాత్రమే కాదు, పాలస్తీనా ఉగ్రవాదులు అనేకమంది ఇదే పద్ధతిలో బిడ్డలకు జన్మనిచ్చినట్టు పాలస్తీనియన్ మీడియా వాచ్ (పీఎండబ్ల్యూ) సంస్థ వెల్లడించింది. ఆ విధంగా 101 మంది బిడ్డలు పుట్టినట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News