COVID19: బ్లాక్ ఫంగస్ కు పతంజలి నుంచి ఆయుర్వేద నాసల్ ఔషధం

Patanjali Develops Ayurveda Nasal Medicine

  • అనూ తైలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
  • యాంఫోటెరిసిన్ కన్నా బాగా పనిచేస్తోందన్న సంస్థ
  • నివారణ ఔషధంగానూ పనిచేస్తుందని వెల్లడి

బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్) చికిత్స కోసం పతంజలి సంస్థ ఆయుర్వేద మందును తీసుకురాబోతోంది. ‘అనూ తైల’ పేరిట ముక్కు ద్వారా ఇచ్చే మందును అభివృద్ధి చేసినట్టు సంస్థ ప్రకటించింది. అధునాతన సాంకేతిక పద్ధతులతో పతంజలి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తల బృందం 'అనూ తైల' మందును కనుగొందని తెలిపింది.

కాగా, ఈ నాసల్ డ్రాప్స్ యాంటీ ఫంగల్ ప్రభావాన్ని మైక్రోబయాలాజికల్, సైటోలాజికల్, అనలైటికల్ కెమికల్ పద్ధతిలో తెలుసుకున్నామని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కరోనా సోకిన తర్వాత వచ్చిన బ్లాక్ ఫంగస్ పై మందు సమర్థంగా పనిచేసినట్టు తమ పరిశోధనల్లో తేలిందని చెప్పారు.

అనూతైలను ఎక్కువసార్లు అప్లై చేయడం వల్ల బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు లేకుండా పోయాయన్నారు. ప్రస్తుతమున్న బ్లాక్ ఫంగస్ ఔషధం యాంఫోటెరిసిన్ బీతో పోలిస్తే అనూతైల బాగా పనిచేస్తున్నట్టు తేలిందన్నారు. బ్లాక్ ఫంగస్ ను తగ్గించే ఔషధంగానే కాక.. దానిని నివారించే ఔషధంగానూ ఇది పనిచేస్తుందన్నారు. కాగా, ప్రాచీన ఆయుర్వేద ఔషధాలకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఇది ఓ ముందడుగని అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News