CM KCR: ఆలిండియా సర్వీసెస్ రూల్స్ సవరణను నిరసిస్తూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

CM KCR shot a letter to PM Modi

  • ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణ
  • రాష్ట్రాలతో పనిలేకుండా అధికారులకు డిప్యుటేషన్
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీయేతర ముఖ్యమంత్రులు
  • తన బాణీ వినిపించిన కేసీఆర్

కేంద్రం అఖిల భారత సర్వీసుల రూల్స్ సవరణ చేపట్టడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ లేఖ రాశారు. ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణ రాష్ట్రాల హక్కులను హరించి వేస్తుందని, కేంద్రం ఒంటెద్దు పోకడలకు పోతోందని విమర్శించారు. ఆలిండియా సర్వీసెస్ అధికారులను కేంద్రం తమ గుప్పిట్లోకి తెచ్చుకునేలా సవరణ ఉందని, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో జోక్యం చేసుకునే ప్రయత్నాలు తగవని పేర్కొన్నారు.

ఈ సవరణతో ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ స్వరూపమే మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం అని, దీన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్ తన లేఖలో డిమాండ్ చేశారు. తాజా సవరణతో, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండానే ఆలిండియా సర్వీస్ అధికారులను డిప్యుటేషన్ పై తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుంది. దీనిపై దేశంలోని బీజేపీయేతర సీఎంలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

  • Loading...

More Telugu News