New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు... నోటిఫికేషన్ కు రంగం సిద్ధం

New districts in AP soon
  • కొత్త జిల్లాలపై మేనిఫెస్టోలో పేర్కొన్న వైసీపీ
  • కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించిన సర్కారు
  • రెండ్రోజుల్లో నోటిఫికేషన్!
  • ఏపీలో 26 జిల్లాల ఏర్పాటు
ఏపీలో పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చుతామని వైసీపీ గత ఎన్నికల వేళ పేర్కొనడం తెలిసిందే. ఈ అంశాన్ని వైసీపీ మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. మరో రెండ్రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను తీసుకురానుంది.

ఏపీలో 25 పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. అయితే, అరకు పార్లమెంటు నియోజకవర్గం విస్తీర్ణం దృష్ట్యా దీన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఏపీలో 26 జిల్లాలు రూపుదిద్దుకోనున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణలో గతంలోనే పెద్ద సంఖ్యలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం తెలిసిందే.
New Districts
Andhra Pradesh
CM Jagan
Manifesto
YSRCP

More Telugu News