Shoaib Akhtar: కోహ్లీ స్థానంలో నేనుంటే పెళ్లి చేసుకునే వాణ్ణి కాదు: షోయబ్ అక్తర్

Former Pakistani cricketer Shoaib Akhtar claims marriage to Anushka Sharma harmed Virat Kohlis career
  • అతని కెరీర్ ను వివాహం దెబ్బతీసింది
  • బ్యాటింగ్ పై దృష్టి పెట్టాలి
  • 10-12 ఏళ్ల క్రికెట్ భిన్నమైనది
  • మళ్లీ తిరిగొచ్చేది కాదు
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మను వివాహం చేసుకోవడం అతని కెరీర్ ను పాడు చేసిందని పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. వన్డే జట్టు కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవడం కూడా అతడ్ని నిరాశకు గురి చేసినట్లు చెప్పాడు.

‘‘విరాట్ 100-120 పరుగులను ప్రతి మ్యాచ్ లో చేస్తే చూడాలని ఉంది. అతడు తన బ్యాట్ పైనే దృష్టి పెట్టాలి. 6-7 ఏళ్ల పాటు కెప్టెన్ గా పనిచేశాడు. కానీ, నిజానికి నేను అతడు కెప్టెన్సీకి అనుకూలం కాదు. ఎందుకంటే అతడు 100-120 పరుగులు చేయాలని.. బ్యాటింగ్ ప్రదర్శన పైనే దృష్టి పెట్టాలని కోరుకునే వాడిని.

విరాట్ స్థానంలో నేను ఉండి ఉంటే పెళ్లి చేసుకునే వాణ్ణి కాదు. చక్కగా పరుగులు సాధిస్తూ ఆనందించే వాడిని. 10-12 ఏళ్ల క్రికెట్ కెరీర్ ఎంతో భిన్నమైనది. అది మళ్లీ రాదు. వివాహం చేసుకోవడం తప్పు అని నేను చెప్పడం లేదు. భారత్ కోసం ఆడుతున్నప్పుడు ఆ సమయాన్ని కొంత ఆస్వాదించాల్సింది’’ అని అక్తర్ పేర్కొన్నాడు.
Shoaib Akhtar
comments
Virat Kohli
marriage
Anushka Sharma

More Telugu News