heritage: మంత్రి కన్నబాబు, అంబటి రాంబాబులపై 'హెరిటేజ్' కేసు కొట్టివేత!
- వారిద్దరిపై 2017లో పరువునష్టం కేసు
- నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ
- ఆధారాలు చూపలేకపోయిన హెరిటేజ్
హెరిటేజ్ సంస్థ గతంలో ఏపీ మంత్రి కన్నబాబు, వైసీపీ నేత అంబటి రాంబాబులపై వేసిన పరువునష్టం కేసును హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, హెరిటేజ్ సంస్థకు పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ హెరిటేజ్ ప్రతినిధి సాంబమూర్తి 2017లో కన్నబాబు, అంబటి రాంబాబుపై కేసులు వేశారు.
నాంపల్లిలోని ప్రజాప్రనిధుల కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. మొదట కన్నబాబు, అంబటి విచారణకు హాజరుకాలేదు. దీంతో వారిద్దరిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి వారిద్దరు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. అయితే, అభియోగాలను రుజువు చేసే ఆధారాలను పిటిషనర్ చూపలేకపోవడంతో కేసును నిన్న నాంపల్లి కోర్టు కొట్టేసింది