COVID19: సినీ నటుడు శ్రీకాంత్ కు కరోనా పాజిటివ్

Actor Srikanth Tested Positive For Covid 19
  • జాగ్రత్తలు తీసుకున్నా వచ్చిందన్న నటుడు
  • రెండు రోజులుగా లక్షణాలున్నాయని వెల్లడి
  • అందుకు కొన్ని గంటల ముందే చిరంజీవికీ పాజిటివ్
సినీ హీరో, నటుడు శ్రీకాంత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కరోనా సోకిందన్నారు. రెండు రోజులుగా కరోనా లక్షణాలు కనిపిస్తుండడంతో టెస్ట్ చేయించుకున్నానని, పాజిటివ్ గా తేలిందని చెప్పారు. తనను ఈ మధ్య కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని, లక్షణాలున్న వారు జాగ్రత్తగా ఉండాలని శ్రీకాంత్ సూచించారు.

 కాగా, శ్రీకాంత్ కు పాజిటివ్ వచ్చిన కొన్ని గంటల ముందే మెగాస్టార్ చిరంజీవికీ మహమ్మారి సోకిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మంచు లక్ష్మి, బండ్ల గణేశ్ తదితరులు మహమ్మారి బారిన పడ్డారు.

ఇదిలావుంచితే, అఖండ సినిమాలో వరదరాజులు పాత్రతో శ్రీకాంత్ క్రూరమైన విలనిజాన్ని చూపించి అందరినీ ఆకట్టుకున్నారు. కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘జేమ్స్’ సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు. అది విడుదల కావాల్సి ఉంది.
COVID19
Omicron
Srikanth
Tollywood

More Telugu News