Nara Lokesh: 43 వేల కోట్ల దోపిడీ కేసులో జ‌గ‌న్‌ ఏ1 అయితే, మోపిదేవి ఏ7: నారా లోకేశ్

Jagan is A1 and Mopidevi is A7 says Nara Lokesh
  • పాలకులు నేరగాళ్లయితే వాళ్ల అనుచరుల ఘోరాలకు అంతే ఉండదు
  • మోపిదేవి రైట్ హ్యాండ్ భూశంకర్ ఈ విషయాన్ని నిరూపించాడు
  • భూశంకర్ లాంటోళ్లు రాష్ట్రంలో ఊరికొకడున్నాడు 
పాలకులు నేరగాళ్లయితే వాళ్ల అనుచరులు పాల్పడే ఘోరాలకు అంతే ఉండదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రైట్ హ్యాండ్ భూశంకర్ ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడని చెప్పారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన భూశంకర్ లాంటి వైసీపీ బూచోళ్లు రాష్ట్రంలో ఊరికొక్కడు ఉన్నారని అన్నారు. యథా లీడర్ తథా కేడర్ అని ఎద్దేవా చేశారు. ఎన్ని నేరాలు చేసినా తమ అధినేత జగన్ కాపాడతాడనే ధైర్యం వల్లే ఈ దారుణాలకు అంతు లేకుండా పోతోందని మండిపడ్డారు. రూ. 43 వేల కోట్ల ప్రజాధనం దోపిడీ కేసులో ఏ1 జగన్ అయితే... ఏ7 మోపిదేవి వెంకటరమణ అని వ్యాఖ్యానించారు.
Nara Lokesh
Telugudesam
Jagan
Mopidevi Venkataramana
YSRCP

More Telugu News