Chandrababu: 'చంద్రబాబు డైనమిక్' అంటూ తడబడి.. సవరించుకున్న స్పీకర్ తమ్మినేని!

AP Speaker Tammineni praises TDP Chief Chandrababu
  • అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడిన తమ్మినేని సీతారాం
  • ప్రభుత్వం చేపడుతున్న కొవిడ్ నివారణ చర్యలు భేష్ అంటూ ప్రశంసలు
  • చంద్రబాబు డైనమిక్ స్టీవర్డ్‌షిప్‌పై ప్రజలకు విశ్వాసం ఉందంటూ తడబాటు 
ఆంధ్రప్రదేశ్ సభాపతి తమ్మినేని సీతారాం టంగ్ స్లిప్పయ్యారు. ముఖ్యమంత్రి జగన్‌కు బదులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి క్రెడిట్ ఇచ్చేశారు. చంద్రబాబునాయుడు డైనమిక్ లీడర్ అంటూ కొనియాడారు.

గణతంత్ర వేడుకల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో నిన్న మాట్లాడిన స్పీకర్.. కొవిడ్ కట్టడికి మన ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించకుండా ఉండలేమని అన్నారు. ఇది చాలా గొప్ప కాన్సెప్ట్ అని, వలంటీర్లు, సెక్రటేరియట్ కాన్సెప్ట్‌ల ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వం చేపట్టే కొవిడ్ నివారణ చర్యలను తీసుకెళ్లే అద్భుతమైన యంత్రాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.

ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారని, చంద్రబాబు నాయుడి డైనమిక్ స్టీవర్డ్‌షిప్‌పై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని అనడంతో అందరూ విస్తుపోయారు. వెంటనే పొరపాటును గుర్తించిన ఆయన.. ఆ వెంటనే సర్దుకుని ‘మన జగన్మోహన్‌రెడ్డిగారు’ అని సరిచేసుకున్నారు. ఆ ప్రయత్నంలో మనం వెళ్లాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.
Chandrababu
Tammineni Sitaram
Andhra Pradesh

More Telugu News