Stock Market: స్టాక్ మార్కెట్లలో 'ఫెడ్' మంటలు... ఐదు నిమిషాల్లోనే రూ.4 లక్షల కోట్లు ఆవిరి!

Investors Lose 4 Lakh Crore Just In Five Minutes

  • విదేశీ వ్యవహారాల దెబ్బకు మార్కెట్లు ‘బేర్’
  • ఉక్రెయిన్ పై రష్యా–అమెరికా మధ్య ఘర్షణ వాతావరణం
  • ప్రస్తుతం 1,200 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్

విదేశీ వ్యవహారాల దెబ్బకు భారత మార్కెట్లు ‘బేర్’మన్నాయి. బెంచ్ మార్క్ సూచీలు పతనమైపోయాయి. మార్కెట్లు ప్రారంభమైన తొలి ఐదు నిమిషాల్లోనే మదుపర్ల సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. వడ్డీ రేట్లను పెంచుతామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ (ఫెడ్)  ప్రకటించడం, రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య ఘర్షణ వాతావరణం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి కారణాలతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడిందని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం 1,211 పాయింట్లు నష్టపోయిన బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ .. 56,664 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 350 పాయింట్ల నష్టంతో 16,928 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ 2.06 శాతం నష్టంతో ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం 540.45 వద్ద ఉన్న విప్రో.. 3.95 శాతం నష్టం వద్ద నడుస్తోంది.

  • Loading...

More Telugu News