anasuya: అన‌సూయ పోస్ట్ చేసిన వీడియోపై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు.. 'ఏందిరా మీ లొల్లి' అంటూ అను ఆగ్ర‌హం

anasuya slams netizens

  • 'వందేమాత‌రం' పాడిన అను
  • నిల‌బ‌డి పాడాల‌ని నెటిజ‌న్ల సూచ‌న‌
  • టీష‌ర్టుపై గాంధీ బొమ్మ ఎందుకుంద‌ని ప్ర‌శ్న‌
  • ఘాటు స‌మాధానం ఇచ్చిన అన‌సూయ‌

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే యాంక‌ర్ అనసూయ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా నిన్న ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ సంద‌ర్భంగా 'వందేమాతరం' ఆలపించింది. అయితే, ఆ స‌మ‌యంలో ఆమె తీరును చూసిన‌ నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అందుకు బోలెడు కార‌ణాలు ఉన్నాయి. వందేమాత‌రం ఆలపిస్తున్న‌ప్పుడు ఆమె నిల‌బ‌డ‌కుండా కూర్చొని వుంది.

వందేమాత‌రాన్ని గౌర‌విస్తూ నిల‌బ‌డి పాడవ‌చ్చు క‌దా? అని నెటిజ‌న్లు నిల‌దీశారు. అంతేగాక‌, ఆ స‌మ‌యంలో గాంధీజి బొమ్మ ఉన్న టీష‌ర్టును వేసుకుంది. దీంతో మహాత్మా గాంధీ బొమ్మ ఉన్న టీ ష‌ర్టు ధ‌రించ‌డానికి, గణతంత్ర దినోత్సవానికి సంబంధం లేద‌ని, మ‌నం జ‌న‌వ‌రి 26న జ‌రుపుకుంటున్న‌ది స్వాతంత్య్ర దినోత్స‌వం కాద‌ని, గ‌ణ‌తంత్ర దినోత్స‌వం అని నెటిజ‌న్లు ఆమెకు సూచించారు.

దీంతో అన‌సూయ త‌న త‌ప్పులు తెలుసుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. తాను నిల్చొని పాట పాడనందుకు చాలామంది అసహనానికి గుర‌య్యార‌ని, త‌న‌ను క్షమించాల‌ని కోరింది. అయితే, తాను చేసిన ప‌నిని కాస్త స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేసింది. జాతీయ గీతమైన జనగణమన పాడేట‌ప్పుడు నిల్చుంటామ‌ని, తద్వారా దేశంపట్ల మన గౌరవాన్ని చాటుతామ‌ని చెప్పింది.

అయితే, తాను పాడింది జాతీయ గేయమైన వందేమాతరం అని, ఈ విష‌యాన్ని నెటిజ‌న్లు గమనించాలని చెప్పుకొచ్చింది. భార‌త‌ దేశం పట్ల త‌నకెంతో గౌరవం ఉందని పేర్కొంది. దీంతో అన‌సూయ‌పై నెటిజ‌న్లు మ‌రింత మండిప‌డ్డారు. దీంతో అన‌సూయ మ‌రోసారి ఈ విమ‌ర్శ‌ల‌పై స్పందించింది. ''అరేయ్ ఏందిరా భయ్‌ మీ లొల్లి'' అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

గాంధీకి, రాజ్యాంగానికి సంబంధం ఏంటని కొంద‌రు అంటున్నార‌ని, వందేమాతరాన్ని జాతీయ గీతం అనుకుంటే మరి జనగణమన ఏంది? అని ప్ర‌శ్నించింది. గాంధీ పోరాడితే స్వాతంత్య్రం రాబట్టే, ఆ త‌ర్వాత‌ గణతంత్ర దినోత్సవం కూడా వచ్చిందని, కాబట్టి కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకుని మాట్లాడాల‌ని ఆమె సూచించింది.

  • Loading...

More Telugu News