Vijayawada: ఎన్టీఆర్ పేరును ఆ జిల్లాకు పెట్టాలంటున్న రచయిత చలపాక ప్రకాశ్
- విజయవాడకు కృష్ణా నదితో అనుబంధం ఉంది
- మచిలీపట్నంకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి
- వీలుకాని పక్షంలో విజయవాడకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెట్టండి
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు ఎన్డీఆర్ పేరును ప్రభుత్వం పెట్టిన సంగతి తెలిసిందే. అయితే జిల్లా పేరులో సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని కవి, రచయిత చలపాక ప్రకాశ్ కోరారు.
తెలుగు నేలకు, భాషకు, చలనచిత్ర రంగానికి ప్రపంచ ప్రఖ్యాతి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. జిల్లాకు అలాంటి మహనీయుడి పేరును పెట్టడం సంతోషకరమని చెప్పారు. అయితే విజయవాడ పట్టణాన్ని తాకుతూ కృష్ణా నది ప్రవహిస్తోందని... ఇక్కడి ప్రజలకు కృష్ణా నదితో ఎంతో అనుబంధం ఉందని అన్నారు. అందువల్ల ఈ జిల్లాకు కృష్ణా జిల్లా అనే పేరు పెట్టాలని, మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరారు. ఒకవేళ విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిసైడ్ అయినట్టయితే... ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెట్టాలని ఆయన కోరారు.