Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 581 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 167 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- మార్కెట్లపై ప్రభావం చూపిన అమెరికా ఫెడ్ ప్రకటన
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు కోల్పోయి 57,276కి పడిపోయింది. నిఫ్టీ 167 పాయింట్లు నష్టపోయి 17,110కి దిగజారింది.
ఈ క్రమంలో బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆటో, ఫైనాన్స్ మినహా అన్ని సూచీలు నష్టపోయాయి. వడ్డీ రేట్లను పెంచుతామంటూ అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (2.81%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.75%), మారుతి సుజుకి (2.52%), కోటక్ బ్యాంక్ (2.02%), సన్ ఫార్మా (0.64%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-4.17%), టెక్ మహీంద్రా (-3.66%), డాక్టర్ రెడ్డీస్ (-3.42%), విప్రో (-3.22%), టీసీఎస్ (-3.18%).