Gorantla Butchaiah Chowdary: 99 తప్పులు చేసిన జగన్.. ఇదొక్క మంచి పని చేశారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

This is the only one best thing Jagan has done says Gorantla Butchaiah Chowdary
  • జగన్ పాలనలో 100 పనులు జరిగితే 99 తప్పులే
  • తప్పుల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య
  • ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడమే జగన్ చేసిన మంచి పని
ముఖ్యమంత్రి జగన్ పాలన అంతా తప్పులమయమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. 2019 నుంచి జగన్ పాలనలో 100 పనులు జరిగితే అందులో 99 తప్పులేనని చెప్పారు. అయితే తప్పుల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడం కూడా వైసీపీ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు.

ఇప్పటి వరకు చేసిన రాష్ట్ర అప్పుల గురించి ప్రభుత్వం నుంచి సమాధానం లేదని, ప్రత్యేక హోదా గురించి సమాధానం లేదని, పెరిగిన ధరల గురించి సమాధానం లేదని, ఉద్యోగుల సమస్యలపై సమాధానం లేదని దుయ్యబట్టారు. అయినప్పటికీ ప్రజల దృష్టిని ఈ సమస్యల నుంచి మళ్లించిందని అన్నారు.

99 తప్పులు చేసిన జగన్ ఒకే ఒక మంచి పని చేశారని... అది కృష్ణా జిల్లాను విభజించి ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడమని గోరంట్ల చెప్పారు. విజయవాడ కేంద్రంగా ఏర్పడబోయే జిల్లాకు ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. జిల్లా ఏర్పాటును చంద్రబాబు, బాలకృష్ణ, పురందేశ్వరి కూడా స్వాగతించారు.
Gorantla Butchaiah Chowdary
Telugudesam
Jagan
YSRCP

More Telugu News