Karumuri Nageswararao: వైసీపీ ఎమ్మెల్యే కారుమూరికి తప్పిన ప్రమాదం

YSRCP MLA Karumuri narrowly escapes from road accident
  • గుంటూరు జిల్లాలో ఘటన
  • హైదరాబాద్ నుంచి త్రిపురాంతకం వెళుతున్న కారుమూరి
  • మాచర్ల మండలంలో రోడ్డుప్రమాదం
  • కారుమూరి వాహనాన్ని ఢీకొట్టిన కారు
వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి త్రిపురాంతకం వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఆయన కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. మాచర్ల సమీపంలోని ఎత్తిపోతల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారుమూరి వాహనం దెబ్బతిన్నది. అనంతరం మరో వాహనంలో ఆయన త్రిపురాంతకం వెళ్లారు. ఎమ్మెల్యేకి ఎలాంటి ప్రమాదం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Karumuri Nageswararao
Road Accident
Guntur District
Tanuku
YSRCP

More Telugu News