Hindupur: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనబడడం లేదని ఫిర్యాదు
- వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానిక బీజేపీ నేతలు
- హిందూపురం కోసం జరుగుతున్న ఆందోళనలపై స్పందించడం లేదని ఆగ్రహం
- రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు నిన్న పట్టణంలోని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ వీరిలో ఏ ఒక్కరూ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి హిందూపురం కోసం జరుగుతున్న ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు.