Raghu Rama Krishna Raju: చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం.. హైకోర్టులో సవాలు చేసిన ఎంపీ రఘురామకృష్ణ రాజు

MP Raghu Rama Krishnam Raju filed PIL Against AP Govt GO 7

  • వందేళ్లుగా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు
  • వేలాదిమంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు
  • ఇప్పుడు వారంతా రోడ్డున పడతారు
  • ఆ జీవోను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలన్న రఘురామ

వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సంఘ సంస్కర్త కళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ప్రదర్శించడాన్ని ఏపీ ప్రభుత్వం ఇటీవల నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయంపై పలువురు కళాకారులు ఇప్పటికే తమ నిరసన వ్యక్తం చేశారు. నిషేధాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. తాజాగా, ఇదే విషయమై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో7ను రద్దు చేయాలని ఆ వ్యాజ్యంలో కోరారు. వందేళ్లకుపైగా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని, దీనిపై ఆధారపడి వేలాదిమంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఇప్పుడీ నాటక ప్రదర్శనను నిలిపివేయడం ద్వారా వారంతా రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటకంలోని ఓ పాత్ర కారణంగా మొత్తం నాటక ప్రదర్శననే నిషేధించడం సరికాదన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ అనాలోచిత చర్య అని, వెంటనే ఈ జీవోను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని రఘురామ రాజు ఆ పిల్‌లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News