Anand Mahindra: బాలీవుడ్ మొట్టమొదటి సూపర్ స్టార్ మహీంద్రా వాహనంలో కూర్చునే పాట పాడాడు: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra interesting tweet on Thar vehicle
  • 1969లో హిందీలో ఆరాధన చిత్రం రిలీజ్
  • హిట్టయిన మేరీ సప్నోంకీ రాణీ పాట
  • రాజేశ్ ఖన్నా, షర్మిలా టాగూర్ జంటగా నటించిన వైనం
  • ఆ పాటలో మహీంద్రా జీపులో హీరో
బాలీవుడ్ లో 1969లో వచ్చిన ఆరాధన చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయింది. అందులోని 'మేరే సప్నోంకీ రాణీ' పాట ఇప్పటికీ సంగీత ప్రియుల మదిలో నిలిచి ఉంది. కాగా, ఆ పాటపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర అంశం వెల్లడించారు.

"1969లో బాలీవుడ్ మొట్టమొదటి సూపర్ స్టార్ మహీంద్రా ఎస్ యూవీలో కూర్చునే తన ప్రేయసి కోసం 'మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీ తూ' అని పాడాడు. దాదాపు అర్ధశతాబ్దం తర్వాత అదే ఎస్ యూవీ కొత్త అవతారం దాల్చింది. ఆనాటి ప్రణయం ఇంకా నిలిచే ఉంది" అంటూ ట్వీట్ చేశారు. కొత్త థార్ వాహనం తాలూకు యాడ్ ను కూడా పంచుకున్నారు.

అప్పట్లో వచ్చిన ఆరాధన చిత్రంలో రాజేశ్ ఖన్నా, షర్మిలా టాగోర్ నటించారు. హిందీ చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదు పొందిన మొదటి హీరో రాజేశ్ ఖన్నానే. ఆ సినిమాలో హీరో మహీంద్రా జీపులో వెళుతుండగా,  రైలులో హీరోయిన్ ప్రయాణిస్తుంటుంది. ఆమెను చూస్తూ హీరో తన ప్రేమను తెలిపే సమయంలో మేరే సప్నోంకీ రాణీ పాట పాడతాడు.
Anand Mahindra
Mere Sapno Ki Rani
Rajesh Khanna
Mahindra Jeep
Thar
Superstar
Bollywood

More Telugu News